ఉత్తమ ఉపాధ్యాయునిగా బండారు శేఖర్
21-09-2026 | 08:10pm
జాజిరెడ్డిగూడెం: జాజిరెడ్డిగూడెం మండలం(Jajireddygudem Mandal) కొమ్మాల గ్రామ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు బండారు శేఖర్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్బంగా సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఎంపీడీఓ ఝాన్సీ, మండల విద్యాధికారి బాలునాయక్ లు అవార్డు అందజేషి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. విద్యా వ్యవస్థ అభివృద్ధికి అందరు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విద్యాసాగర్, ఉపాధ్యాయులు డి ఎల్లయ్య, భూపతి శ్రీనివాస్, సైదులు, సంద్యారాణితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న శేఖర్ ను బంధుమిత్రులు,ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.