బిగ్ ఫైట్.. 4 జట్లు.. 2 బెర్తులు!

01-10-2026 | 07:36am

నాగోయా, అక్టోబర్ 1: ఏషియన్ గేమ్స్ 2026లో(Asian Games 2026 Cricket) పురుషుల క్రికెట్‌లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. నేడు రెండు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్-బంగ్లాదేశ్, రెండో సెమీఫైనల్‌లో భారత్-శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి.

పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్

తొలి సెమీఫైనల్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్(Pakistan vs Bangladesh) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. జపాన్‌లోని నిషిన్‌లో ఉన్న కోరోగి స్పోర్ట్స్ పార్క్ ఈ మ్యాచ్‌కు వేదిక. ఇరు జట్ల క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దవడంతో.. ఉన్నత సీడింగ్ ఆధారంగా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.

భారత్ vs శ్రీలంక

ఇక భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్..(India vs Sri Lanka) శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10:00 గంటలకు IST ప్రారంభం కానుంది. జపాన్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్(India cricket Asian Games) క్వార్టర్‌ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది. మెరుగైన సీడింగ్ కారణంగా భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక-నేపాల్ క్వార్టర్‌ఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దవడంతో శ్రీలంకకు సెమీస్ బెర్త్ లభించింది.

ఫైనల్ బెర్త్ కోసం పోరు

ఇప్పటివరకు వర్షం కారణంగా పురుషుల క్రికెట్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లన్నీ రద్దయ్యాయి. దీంతో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా సెమీఫైనల్స్‌కు(Asian Games semi final schedule) చేరుకున్నాయి. ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించిన రెండు జట్లు అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మరి భారత్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుందా? పాకిస్థాన్-బంగ్లాదేశ్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? నేడు జరిగే రెండు సెమీఫైనల్స్‌తో దీనికి సమాధానం దొరకనుంది.

మరిన్ని వార్తలు