విద్యార్థినుల వంటావార్పు
19-09-2026 | 08:55pm
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్(Bellampalli Polytechnic) విద్యార్థినిల నిరసన కొనసాగుతుంది. G.O.97 రద్దు కోసం విద్యార్థినిలు ఆందోళన(students protest) చేస్తున్నారు. అందులో భాగంగానే కళాశాల ఆవరణలో వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవ రద్దు చేసేంతవరకు తమ ఆందోళన వివిధ రూపాలలో కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.