ఉపాధ్యాయులకు పురస్కారాలు

21-09-2026 | 09:36pm

ఎంపీడీవో, ఎంఈఓ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలం(Chivvenla Mandal)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు(Best Teacher Awards) 28 మంది ఎంపికయ్యారు. విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఎంపీడీవో సంతోష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి(Mandal Education Officer) రమణ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. 

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయడం, విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు ఎంఈఓ రమణ తెలిపారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంఈఓ రమణతో పాటు పలువురు అధికారులు, విద్యాశాఖ సిబ్బంది అభినందించారు.

మరిన్ని వార్తలు