చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలి
మణుగూరులో కరపత్రాల విడుదల
మణుగూరు, అక్టోబర్ 2(విజయక్రాంతి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముట్టడి (Bhadradri Kothagudem Collectorate siege)కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), ఆదివాసి సంక్షేమ పరిషత్, పొలిటికల్ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మణుగూరు మండలంలోని డీవీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నా, ముట్టడి కార్యక్రమంలో ఆదివాసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షులు మొత్తం ఉపేందర్, ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, జేఏసీ అధ్యక్షులు కోణం శ్రీనివాస్, పొలిటికల్ జేఏసీ నాయకులు వాసం రామకృష్ణ దొర,
ఆదివాసి హక్కుల పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రచార కార్యదర్శి పడిగా నారాయణ, సుతారి వెంకన్న, ఇమ్మడి నాగేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు కొమరం సైదులు పాల్గొన్నారు.మండల కమిటీ సభ్యులు వరుస దాసు, కొమరం వెంకటేశ్వర్లు, మడకం శ్రీను, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు పడిగా అశోక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.