గణపతి మండపం వద్ద భజన కార్యక్రమాలు
21-09-2026 | 09:59pm
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bhiknur Mandal)లోని కంచర్ల గ్రామంలో నాగిరేశ్వర భజన మండలి ఆధ్వర్యంలో రుద్రసేన గణపతి మండపం(Ganapati Mandapam) వద్ద భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఈ భజనలు కొనసాగిస్తామని రుద్రసేన సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు యువకులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిగీతాలు, భజన పద్యాలను ఆలపిస్తూ సందడి చేశారు. యువత భజన కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని నిర్వాహకులు సూచించారు. భజన పద్యాలను నేర్చుకుని సంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ యువత, భక్తులు పాల్గొన్నారు.