6 September, 2026 | 6:23 AM

ఉత్తమ ఉపాధ్యాయురాలు భవాని

06-09-2026 | 05:00am
  1. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు 
  2. కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాలలో బోధన

కామారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) గాంధారి ప్రాథమిక బాలికల పాఠశాల(Gandhari Primary Girls School) ఉపాధ్యాయురాలు భవాని(Bhavani) రాష్ట్రపతి అవార్డు(President Award)కు ఎంపికయ్యారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము(Murmu) చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు(Best Teacher Award) అందుకున్నారు. తెలంగాణ(Telangana) నుంచి ఏకైక ఉత్తమ మ హిళా ఉపాధ్యాయురాలిగా భవాని రికార్డు సృష్టించారు. యూట్యూబ్ ద్వారా భవాని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయడంతో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 

మరిన్ని వార్తలు