ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ లక్ష్యం
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ప్రజాదివాస్ కు 18 ఫిర్యాదులు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజల సమస్యల(Public Grievances) తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirishetti Sankeerth) అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమం(Praja Divas Program)లో ఎస్పీ జిల్లా వ్యాప్తంగా వచ్చిన 18 ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు లేదా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.