గండక్ ఉగ్రం..బిహార్ విలవిల!

03-10-2026 | 07:50am

బిహార్‌(Bihar)ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదల కారణంగా గండక్‌ నది(Gandak River) ఉధృతి మరింత పెరిగింది. వరద ప్రవాహానికి కరకట్టలు తెగిపోవడంతో సమీప ప్రాంతాలు పూర్తిగా జలమయం(Waterlogged) అయ్యాయి. మరోవైపు గంగా నది(Ganga River) కూడా ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు(Relief Operations) ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు