6 September, 2026 | 12:21 AM

విద్య వైద్య ఉపాధి హక్కుల కోసం సమరశిల పోరాటాలకు సిద్ధంకండి

05-09-2026 | 10:36pm

సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట(Yadagirigutta)లో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య(All India Youth Federation) రాష్ట్ర 3వ మహాసభలను సెప్టెంబర్ 8 న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ యాదగిరిగుట్టలో శనివారం  బైక్ ర్యాలీ(Bike Rally) తీశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన  విద్య, వైద్యం ఉపాధి హక్కులకై యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు, యువత ఎదుర్కొంటున్న విద్య, వైద్యం, ఉపాధి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల(Government jobs)ను వెంటనే భర్తీ చేయాలని, లేనియెడల నిరుద్యోగ భృతి వెంటనే అమలుచేయాలన్నారు. సెప్టెంబర్ 8 వ తేదీన యాదగిరిగుట్టలో బస్టాండ్ దగ్గర జరిగే ఏఐవైఎఫ్ బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 ఈ కార్యక్రమంలో ఏఐవై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కళ్లెం కృష్ణ, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ, సిపిఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, పట్టణ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్ మున్సిపల్ మాజీ కో ఆప్షన్ మెంబర్ పేరబోయిన పెంటయ్య, పేరబోయిన బంగారు, గోపగాని రాజు, గుండు వెంకటేష్,ఏఐవైఎఫ్ మండల అధ్యక్షకార్యదర్శులు ప్రణయ్, కంబాల వెంకటేష్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు