రాగిరిలో టీఆర్‌పీలోకి భారీగా మహిళల చేరికలు
06-09-2026 | 12:11am
హక్కుల సాధనకు మహిళలంతా ఏకం కావాలి: పటేల్ వనజక్క
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా రాగిరి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి పలువురు మహిళలు భారీగా చేరారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు బుద్ధుల సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమారి, రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని నాయకులు తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా పల్లెర్ల లలిత, రాగిరి గ్రామ శాఖ అధ్యక్షురాలిగా రాజమణి నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని లలిత, రాజమణి తెలిపారు.






