రైతులకు కోతలు లేని నిరంతర విద్యుత్ అందించాలి
కొత్తపల్లి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతులకు కోతలు విధించకుండా కరెంట్ ఇవ్వాలని బీజేపీ నాయకులు (BJP leaders)డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎన్పీడీసీఎల్, ఏడీ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యుత్ శాఖ తరచూ కోతలు విధిస్తుండటంతో బావులు, బోర్లు, వాగుల కింద ఉన్న పొలాలకు రైతులు సరిపడా నీరు పారించలేకపోతున్నారని, ప్రస్తుతం వరి పంట అత్యంత కీలక దశలో ఉందని, ఈ సమయంలో కోతలు కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని,రైతులకు ఎటువంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడాలని, ఈ వినతిని వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కొత్తపల్లి మండల అధ్యక్షులు కుంట తిరుపతి, జోన్ అధ్యక్షుడు హరీష్ రావు, పశ్చిమజోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి, గుంజేటి శివకుమార్, జిట్టవేని రేణు, సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మెరుగు పరుశురాం, అనిల్ కుమార్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.