అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులతో చెలగాటం

02-10-2026 | 08:06pm

48 గంటల్లో సమస్య పరిష్కరించాలి: కొండపల్లి శ్రీధర్ రెడ్డి

నేలకొండపల్లి, ఖమ్మం, అక్టోబర్ 2(విజయక్రాంతి): అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళా రైతులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి(Kondapalli Sridhar Reddy) మాట్లాడుతూ, వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు నాణ్యమైన విద్యుత్ కూడా అందించలేని దుస్థితికి చేరిందని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అనంత ఉపేందర్ గౌడ్ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా కిరణ్, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు సుధాకర్, మన్నే కృష్ణారావు, గోవిందరావు, జ్ఞానరత్నం, కెమెరా ఉపేందర్, మల్లేష్, పురాణం దివాకర్, కందనబోయిన వెంకటరమణ, రామకృష్ణ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు