6 September, 2026 | 8:31 AM

పాక్ ఆర్మీపై బీఎల్‌ఏ దాడులు

06-09-2026 | 05:15am
  1. బలూచిస్థాన్‌లో 25 మంది సైనికులు మృతి
  2. పాక్‌సైన్యం కాల్పుల్లో 50 మంది ఉగ్రవాదులు హతం

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 4: బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ దెబ్బకు పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాక్ సైనిక కాన్వాయ్‌పై బీఎల్‌ఏ (BLA on Pak military convoy) ఆకస్మిక దాడిలో క్షణాల్లోనే వాహనాలు పేలి..కాలిపోయాయి. ఈ దాడిలో 25 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు బీఎల్‌ఏ ప్రకటించింది. తేరుకున్న పాకిస్థాన్.. వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. పాక్ ఆర్మీ వరుస ఆపరేషన్లతో ఉగ్రసంస్థలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో 50 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్‌సైన్యం ప్రకటించింది.

గత 72 గంటల్లో బలూచిస్థాన్ అంతటా 50 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఐఎస్‌పీఆర్ పేర్కొంది. అలాగే 4 ఉగ్రస్థావరాలను పేల్చేశామని వెల్లడించింది. మస్తుంగ్, క్వెట్టా, కలాత్, సిబి జిల్లాల్లో పాక్‌సైన్యం ఆపరేషన్లు, బీఎల్‌ఏ టెర్రరిస్టుల కాల్పుaతో బలూచిస్థాన్ దద్దరిల్లుతోంది.  పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన క్వాడ్‌కాప్టర్ దాడిలో ఒక బాలిక మరణించింది.  

72 గంటల్లో 48 మంది టెర్రరిస్టులు హతం

గత 48 గంటల్లో బలూచిస్థాన్ అంతటా 50 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఐఎస్‌పీఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది. మస్తుంగ్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో ఆరుగురు, క్వెట్టాలోని షబాన్ ప్రాంతంలోని 26 మంది, కలాత్ జిల్లాలో ఇద్దరు, సిబి జిల్లాలోని భాగ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

కలాత్ జిల్లాలో బుధవారం జరిగిన కాల్పుల్లో 12 మంది టెర్రరిస్టులు హతమైనట్లు పేర్కొంది. ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి, ఐఈడీ నిల్వలను అక్కడికక్కడే ధ్వంసం చేశామని పాక్‌సైన్యం పేర్కొంది. బలూచి స్థాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గత నెలలో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. శ్రీలంకలో ఎల్టీటీఈని నిర్మూలించినట్లుగా బీఎల్‌ఏను నిర్మూలించాలని సైనిక చర్యకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


మరిన్ని వార్తలు