కేసముద్రంలో ఘనంగా "సేవా సంకల్ప్ అభియాన్"
03-10-2026 | 11:01pm
మహబూబాబాద్ (విజయ క్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రజా జీవితం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా(Bharatiya Janata Yuva Morcha), భారతీయ జనతా పార్టీ కేసముద్రం మండల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో "సేవా సంకల్ప్ అభియాన్(Seva Sankalp Abhiyan)" లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.