పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి అండ

03-10-2026 | 02:24pm

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): కల్యాణ లక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇల్లెందు జగదంబ సెంటర్‌లోని తెలంగాణ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ మహిళా నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో దోహదపడ్డాయన్నారు.

రూ.1,00,116 ఆర్థిక సాయం అందించడం ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే పథకం వర్తించే నిబంధనతో బాల్యవివాహాల నియంత్రణకు, ఆడపిల్లల చదువుకు ప్రోత్సాహం లభించిందన్నారు. కులమతాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు పథకం ద్వారా ప్రయోజనం చేకూరిందని తెలిపారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా నాయకులు మదర్‌బీ లంజపల్లి సులోచన, కే.భవాని, నూరి, సల్మా, గౌసియా, నారాయణమ్మతో పాటు సుదర్శన రంగనాథ్, అబ్దుల్ జబ్బర్, శీలం రమేష్, బాహుసింగ్ నాయక్, ఇర్ప కాంతారావు, ఎన్.రాజకోటి, రాచపల్లి శ్రీనివాసరావు, నారాపాక వసంత్, పరకపల్లి రవి, కిషన్ ప్రసాద్ పాసి, గాజీ, ఉపేందర్ రావు, గోల్డ్ ఇమ్రాన్, గాడి శ్రీను, ఎస్‌కే అమీర్, లంజపల్లి రాంబాబు, జ్వాలా సాంబ, మునిగంటి శివ, ఎస్‌కే కమురు, సురేష్ సాహు, రామ్‌లాల్ పాసి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు