హీరోయిన్ బుగ్గ గిల్లిన ఫ్యాన్! వీడియో వైరల్

03-10-2026 | 02:57pm

సెల్ఫీ మధ్యలో షాక్ ఇచ్చిన ఫ్యాన్! 

బెంగళూరు: కన్నడ నటి రచితా రామ్‌ పుట్టినరోజు( Rachita Ram Birthday Viral Video) వేడుకల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో ఫొటోలు దిగుతున్న సమయంలో ఓ ఫ్యాన్ చేసిన పని ఆమెను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన Rachita Ram Viral Video ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుట్టినరోజు సందర్భంగా రచితా రామ్‌ను కలిసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. వారితో ఆమె ఓపికగా ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు ఇస్తూ కనిపించింది. ఈ క్రమంలో ఓ అభిమాని కూడా ఆమెతో Selfie with Rachita Ram తీసుకున్నాడు. అనంతరం ఆమెతో చేతులు కలిపాడు. అంతా సాధారణంగానే జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా రాచిత రెండు చెంపలను పట్టుకుని నొక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో Rachita Ram Reaction వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె వెంటనే తేరుకుని మిగతా అభిమానులతో తన కార్యక్రమాన్ని కొనసాగించింది. అయితే అక్కడ జరిగిన ఈ చిన్న ఘటనను ఎవరో వీడియోలో రికార్డు చేయడంతో అది సోషల్ మీడియాలోకి వచ్చింది. ప్రస్తుతం Rachita Ram Viral Videoపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అభిమానుల ఉత్సాహం హద్దులు దాటకూడదని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు వీడియోలో రాచితకు ఎదురైన అనుకోని పరిస్థితిపై చర్చిస్తున్నారు. సెలబ్రిటీలను కలిసే సమయంలో వారి వ్యక్తిగత హద్దులు, గౌరవాన్ని కాపాడుకోవాలనే చర్చ కూడా ఈ వీడియోతో మరోసారి తెరపైకి వచ్చింది. కూలీ సినిమాలో రాచిత రామ్ నటించడంతో ఆమెకు సంబంధించిన ఈ వీడియోపై సినీ అభిమానుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో Rachita Ram News, Rachita Ram Birthday, Rachita Ram Viral Video వంటి అంశాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.



మరిన్ని వార్తలు