మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పృథ్వి రాజ్

02-10-2026 | 05:00pm

ఆర్మూర్, అక్టోబర్ 02 (విజయ క్రాంతి) : బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా(BRS Party Armoor Municipal Floor Leader) కౌన్సిలర్  గుంజాల పృథ్వి రాజ్ నియమితులయ్యాడు. నియామక పత్రాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి(Former MLA Jeevan Reddy) నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గుంజల పృథ్వీ రాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆర్మూర్ మున్సిపల్ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే  ఆశన్నగారి జీవన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.

పార్టీ తనకు అప్పగించిన  బాధ్యతను అంకితభావంతో, నిబద్ధతతో నిర్వహిస్తానని పేర్కొన్నాడు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ, పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో చురుకైన పాత్ర పోషిస్తానని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ, పార్టీ ఆశయాలు మరియు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతానని గుంజల పృథ్వీ రాజు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గుంజల పృథ్వీ రాజుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అజీమ్, నదీమ్, నయీమ్ దినేష్, పట్టణ అధ్యక్షుడు  పూజ నరేందర్, మాజీ సర్వసమాజ్ అధ్యక్షడు  గుండేటి మహేష్, సుంకరి రవి, సీనియర్ నాయకులు పోల సుధాకర్, మీర శ్రావణ్ పిప్రి సర్పంచ్ బందెల కిరణ్, మాజీ సొసైటీ చేర్మెన్ సోమ హేమంత్ రెడ్డి, రోహిత్, రశాద్, పవన్, శ్రీకాంత్, భరత్ కార్తీక్, ఆదిత్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు