తహశీల్దార్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతిపత్రం
కొండాపూర్, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొండాపూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ్యకం విట్టల్, జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు మల్లా గౌడ్, ప్రేమానందం, పాండురంగం, రుక్ముద్దీన్, అమరేందర్రెడ్డి, మహేష్, వినోద్, అనిల్, రామగౌడ్, ఇంద్రారెడ్డి, సత్యానందం, నర్సింలు, రాముల నాయక్, జలీల్, సంతోష్రెడ్డి, రాజు, రవి, మొగులయ్య, జగదీష్, ప్రకాష్, మోహన్గౌడ్, రామచంద్రరాజ్, కుమార్, శ్రీకాంత్, సంగారెడ్డి రాజు, నమ్మే నాయక్, కిష్టారెడ్డి, శేఖర్, రవీందర్, సాయిరెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
