బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
భారాస జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు
వెంకటాపూర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారాస జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు(BRS President Lakshman Babu) అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మర్రి రాములు, మర్రి కోటయ్య, కొలనుపాక శ్రీరాములు, కొలనుపాక లింగమూర్తి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన లక్ష్మణ్ బాబు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోవింద్ నాయక్, కృష్ణ, జంపన్న, భద్రయ్య, గోపాల్ రెడ్డి, అనోజ్ రెడ్డి, రవి, సాంబయ్య, సదయ్య, ప్రశాంత్, నరసింహ నాయక్, మహేష్, రవీందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.