6 September, 2026 | 8:21 PM

తిమ్మంపేటలో బిఆర్ఎస్ నిరసన

06-09-2026 | 07:24pm

ములకలపల్లి,సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): అమలు కానీ హామీలతో గద్దెనెక్కి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తిమ్మంపేట(Thimmampeta) గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం శ్రీనివాస్(Sarpanch Turram Srinivas) ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. పడకేసిన పల్లెలు- అభివృద్ధికి నోచుకోని గ్రామపంచాయతీలు అనే నినాదంతో వంద రోజులలో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వితంతు, వికలాంగుల,వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని,ఆటో కార్మికులకు కౌలు రైతులకు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ 12 వేల చొప్పున, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ 3వేలు,18 సంవత్సరాలు దాటిన యువతిలకు స్కూటీలు ఇవ్వాలని పథకాలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు బోయినపల్లి శ్రీనివాస్,వార్డు మెంబర్స్ కోండ్రు మధు,మడకం ప్రభాకర్,రవ్వ నరేష్,గడ్డం సామెల్,సోడే కేశవ్,   తదితరులు పాల్గొన్నారు.





మరిన్ని వార్తలు