శిక్ష రత్న అవార్డు అందుకున్న సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్
బోథ్. సెప్టెంబర్ 6 ( విజయ క్రాంతి): విద్య బోధన శిక్షణ కోచింగ్ మెంటల్ షిప్ అకడ మిక్(Training Coaching Mental Ship Academic) లీడర్‌షిప్‌లో విశిష్ట సేవలు అందించినందుకు గాను శిక్ష రత్న అవార్డును మండలంలోని సాంఘిక సంక్షేమ కళాశాల ప్రిన్సిపల్ సంగీతకు దక్కింది.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని కనక శాంతి వనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 1000మందిని గుర్తించి అందులో నుండి 234మందికి అవార్డు అందించారు.ఈ అరుదైన గౌరవం తెలంగాణలోని బోత్ కళాశాల ప్రిన్సిపాల్‌కు దాకడం వల్ల జిల్లాలోని బోథ్ మండలం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. హరి యూనివర్సిటీ మీడియా వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ అవార్డుల ప్రధానోత్సవం యూనివర్సిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.తనకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో మరింత చురుకుగా పని చేయాల్సి వస్తుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు






