తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన.. బీఆర్ఎస్ నిరసన ర్యాలీ
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తారన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా అడ్డగింత
హామీలను అమలు చేసేంత వరకు వెంటాడి పోరాడుతాం
గుండాల, (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress government) ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు(BRS Mandal Presidents) తెల్లం భాస్కర్, మోకాళ్ళ వీరస్వామి, గడ్డం వీరన్నలు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ(BRS protest) నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తారన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తే ఎక్కడ ప్రభుత్వ వైఖరి బయటపడుతుందోనన్న భయంతో లోనికి రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నారని అన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులు చేసి మహిళా నాయకులపై కూడా దాడులకు దిగటం సరైనది కాదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేయటం మీద దృష్టి పెట్టాలే తప్ప ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కి, దాడులకు దిగటానికి చూడకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు టి రాము, వట్టం రవి, గొగ్గెల లక్ష్మీనారాయణ, నిట్ట రాములు, గొగ్గెల రాంబాబు, తాటి కృష్ణ, స్వర్ణభాక సుధాకర్, జాడి ప్రభాకర్, కసనబోయిన వెంకన్న, బొమ్మెర్ల శ్రీను, పద్మారావు, సతీష్, నరేష్, కిరణ్, తాటి పాపారావు, కల్తి కుమార్, పాయం సుధాకర్, మోకాళ్ళ సతీష్, గాంధర్ల కిరణ్, జనగం ఆగయ్య, కాలు, బాలు, కుంజ నగేష్, శోభన్ బాబు, ధనసరి భాస్కర్, సనప రవి, ఈసం ప్రేమ్ సాగర్, దుండ్ర లలిత, చేబోతు గాయత్రి, మల్లెల సుమలత తదితరులు పాల్గొన్నారు.