కేసీఆర్ నివాసంపై దాడి యత్నానికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన
09-09-2026 | 09:50am
కుభీర్,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నివాసంపై కాంగ్రెస్ గుండాల దాడి యత్నాన్ని నిరసిస్తూ భైంసా పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders), కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. కిరణ్ కొమ్రేవార్, బీసీ నాయకుడు సుంకెట పోశెట్టి, రావుల పోశెట్టి, గడ్డం సంజీవ్, అబ్దుల్ వాసే, అజీజ్ కురేషి, దగ్డే కపిల్ తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.