నామీదనే ఫిర్యాదు చేస్తారా.. మీ అంతు చూస్తా!

09-09-2026 | 05:30am
  1. నాకు హాకర్స్ తెలుసు.. వారిచే మీ కాల్ డేటా తీయిస్తా

నన్ను తక్కువ అంచన వేస్తే మిమ్మల్ని కనుమరుగు చేస్తా

ఇలాంటి విచారణలు నన్నేమి చెయ్యలేవు

మహిళలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్నా బాస్

ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొంటే వచ్చే ప్రభుత్వంలో మళ్లీ వస్తా

పట్టణంలో హాట్ టాపిక్‌గా మారిన బాస్ వ్యవహారం

రోజు రోజు పెరుగుతోన్నా బాస్ బాదిత మహిళల సంఖ్య

బాస్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం.. కఠిన చర్యలకు ఆదేశాలు

మహళల్ని వేధిస్తే సహించేది లేదు.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నడుస్తుంటే.... పాలమూర్ మెప్మాలో (Palamuru MEPMA)మాత్రం మరో ప్రభుత్వం నడుస్తోందని బాదిత మహిళలు విజయక్రాంతితో ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యవహారంపై విజయక్రాంతిలో నేనే బాస్ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించడంతో బాదిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆ బాస్ లీలలు చెబుతూ బోరున విలపిస్తున్నారు....

ఇక్కడ నేనే బాస్ ని..నేను చెప్పిందే వేదం..నేను చెప్పినట్లే పనిచెయ్యాలని.. లేదంటే మీకు పుట్టగతుల్లేకుండా చేస్తానంటూ మెప్మాలో గత కొన్నేళ్లుగా ఓ పురుష ఉద్యోగి తోటి మహిళా ఉద్యోగులు, ఇతర మహిళలపై పెత్తానం చెలాయిస్తూ హాయిగా కాలం గడుపుతూ వచ్చాడట.

కాగా కాలం, సమయం ఎప్పుడో ఒకసారి సమాధానం చెబుతాయి కదా..అతని బాధిత మహిళల సంఖ్య రోజు రోజుకు పెరుగుతండడంతో ఆ సమయం ఇప్పుడు ఆ బాస్కు ఎదురవుతోందని, అప్పుడు మేము అనుభవించిన మానసిక క్షోభను ఇప్పుడు చెప్పుకొనేందుకు విజయక్రాంతి ద్వారా తమకు అవకాశం వచ్చిందని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇక ఈ కథనాన్ని విజయక్రాంతి ద్వారా వెలుగుల్లోకి తీసుకరావడంతో ఆ బాస్ ఒక్కసారిగా అగ్రహానికి గురై నాపైనే పిర్యాదు చేస్తారా..

పిర్యాదు చేసినా వారిని వదిలిపెట్టకుండా మీ అంతూ చూసేంత వరకు నేను నిద్రపోనంటూ మెప్మా కార్యాలయంలో ఎగిరెగిరి పడుతున్నాడట. అక్కడితో ఆగకుండా, నాకు పెద్ద పెద్ద హ్యాకర్లు తెలుసు వారిచే మీ కాల్ డేటాను తీయించి మిమ్మల్ని బజారులో నిలబెడతానని వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడట. ఇదే కాకుండా, నన్ను తక్కువ అంచన వేస్తే మిమ్మల్ని కనుమరుగు చేస్తానని తనదైన శైలిలో మహిళల్ని భయపెడుతున్నాడని బాదిత మహిళలు చెబుతున్నారు.

ఎందుకంటే అతనిపై ఇది వరకే జిల్లాకలెక్టర్తోపాటు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం విచారణకు ఆదేశించడంతో ఏం చెయ్యాలో తెలియక తప్పించుకొనేందుకు శత విధాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడట. అక్కడితో ఆగకుండా నన్ను ఇలాంటి విచారణలు ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే నాకు రాష్ట్రస్థాయిలో మంచి పలుకుబడి ఉందని ప్రకటిస్తూ చెలరేగిపోతున్నాడట. 

మద్దతు కరువుతో ఉక్కిరిబిక్కిరి

గతంలో అ అతనిపై ఇలాంటి అరోపణలు వస్తే తన్ను కాపాడుకొనేందుకు చాలా మంచోడు ఇతని గురించి మాకు తెలుసంటూ... కొంత మంది మహిళలచే ఎమ్మెల్యే. కలెక్టర్, ఇతర అధికారులకు చెప్పించి సమస్యను సద్దుమణుగజేసే వాడట. కానీ ఇప్పుడు అదే ట్రిక్ని ప్లే చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా అప్పుడు మద్దతుగా నిలిచినా మహిళలు ఎవ్వరు ముందుకు రావడంలేదట.

ఎందుకంటే వారిలో కొంత మంది అతినికి బాధితులుగా మారడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోందని బాదితులు చెబుతోన్నా మాట ఇది. ఇక ఎప్పుడు ఒక పాలసీ కట్టి న్యూస్ రాసే వారు కూడా ఇతని వ్యవహారం బయటపడడంతో అతను కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏ రూట్లో ప్రయత్నించి తను మెప్మాలోనే కొనసాగితే మా పరిస్థితేంటని బాదిత మహిళా ఉద్యోగులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మహిళలతో పనిచేసేందుకు మహిళా ఉద్యోగులను కాకుండా పురుష ఉద్యోగులను నియమించడమేంటని తోటి మహిళా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.  కోటీశ్వరులు చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటేః కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంల్లోకి రాగానే మహిళల్ని కోటీశ్వరులుగా చేసే లక్ష్యంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి వాటిని సద్వినియోగం చేసుకొనేలా వేగం పెంచింది.

ఇక మన పాలమూర్ పట్టణంలో అయితే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహిళల కోసం ప్రభుత్వం కంటే ఒక మెట్టు ముందుకు వేసి తన సొంత నిధులచే ఉపాది శిక్షణను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్లకు పైగా నాలుగు వందల మంది మహిళలకు శిక్షణను పూర్తి చేయించి అనంతరం వారికి సర్టిఫికేట్స్, శిక్షణ ఇచ్చిన యూనిట్లను ఉచితంగా అందజేస్తూ వారిని ప్రొత్సహిస్తున్నారు.

ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణ్ణంగానే మున్సిపల్ మేయర్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డిలు సైతం అదే తరహాలో రాణిస్తున్నారు. ఇలా వీరు మహిళల్ని కోటీశ్వరులుగా చేసేందుకు ప్రయత్నం చేస్తుంటే... వీరి ఆశయాలను తుంగలో తొక్కే విధంగా కనిపించని మరో బాస్ మాత్రం మహిళా సంఘాలతో పనిచేసే అర్పిల చేత చక్రం తిప్పుతున్నాడు. పట్టణంలో వందకు పైగా రిసోర్స్పర్సన్స్ పనిచేస్తుండగా,

వారిలో కొంతమందిని ఆ బాస్ తనకు అనుకూలంగా మార్చుకొని వారిచేత మహిళా సంఘాలకు వస్తోన్నా యూనిట్లను కాజేస్తున్నారంట. ఇలా ఆ బాస్ తనకు అనుకూలంగా ఉన్నా రిసోర్స్పర్సన్స్ చేత బినామీ వ్యాపారం చేస్తూ, తనకు గిట్టని వారిపై ఉక్కుపాదాన్ని మోపుతున్నాడట. ఎలా అంటే వారిపై రక రకాల పిర్యాదులను సృష్టించి పై అధికారులకు వారిపై మహిళలచేతనే పిర్యాదు చేయించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళలు చెబుతున్నా మాట ఇది.

ఇక తన వ్యాపారంతోపాటు, ఇతరత్రా వ్యవహారాలు ఎక్కడ బయటకొస్తాయోనని భావిస్తోన్నా ఆ బాస్ ఎమ్మెల్యే, కలెక్టర్లతోపాటు, ఇతర అధికారుల దగ్గర తానే ముందు వెళ్లి ఏ మహిళా ముందుకు వచ్చి మాట్లాడకుండా తాను చెప్పిందే వేదం లా నడిపిస్తున్నాడట. అతడు నోరు పెద్దగా పెత్తనం చెలాయిస్తుండడంతో అమాయక మహిళలంతా చేసేది లేక దిక్కుతోచని పరిస్థితిని అనుభవిస్తున్నారని వారంతా బోరున విలపిస్తున్నారు. 

సహించేది లేదు

మెప్మాలో మహిళా ఉద్యోగులతోపాటు, మహిళలను వేదిస్తోన్నా ఆ ఉద్యోగిని సహించేది లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయక్రాంతికి తెలిపారు. మాది ప్రజా పాలన...మా పాలనలో మహిళల్ని కోటీశ్వరులుగా చెయ్యడమే మా ఉద్దేశ్యమని, కానీ వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను మహిళలకు కాకుండా రిసోర్స్పర్సన్స్కు ఇప్పించి బినామీ వ్యాపారం చేస్తోన్నా వారిని సహించేది లేదని హెచ్చరించారు. బాదిత మహిళలు ఇలాంటి వాటికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పిర్యాదు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకొంటామని వారికి భరోసా ఇచ్చారు.

 విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మరిన్ని వార్తలు