సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు

09-09-2026 | 03:06pm

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా నిర్ణయం

సిద్దిపేటరూరల్,సెప్టెంబర్ 9: సిద్దిపేట ఎంపీడీవో(MPDO) కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశాన్ని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సిద్దిపేట రూరల్ మండల సర్పంచ్‌ల ఫోరం బహిష్కరించరూ. ఫోరం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అనంతరం కేసీఆర్ మరణాన్ని కోరుకుంటూ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బుగ్గ రాజు, నాగరాజు, తిరుపతి, కృష్ణ, కోడూరు రాజు, శ్రీనివాస్, దేవేందర్, గోపీనాథ్, బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు