విగ్నేశ్వరునికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడి పూజలు
19-09-2026 | 06:33pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్(Ghatkesar Circle), ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్ లో ఏర్పాటు చేసిన భజరంగ్ యూత్(Bajrang Youth), బీసీ కాలనీ, రజక సంగం, వినాయక మండపాలను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు డాక్టర్ చామకూర భద్రారెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సందర్శించి వినాయకున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు బొడిగె శ్రీనివాస్ గౌడ్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.