ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌కు చెక్

19-09-2026 | 09:10pm

చాణిక్యపురి కాలనీ సమస్యకు పరిష్కారం

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం(Uppal Constituency) శక్తి సాయి నగర్ డివిజన్ చాణిక్యపురి కాలనీలో నివాసాల మధ్య ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ శాఖ(Electricity Department) అధికారులు మరో సురక్షిత ప్రాంతానికి తరలించి స్థానికుల సమస్యను పరిష్కరించారు. ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ప్రజలు రాకపోకలు సాగించడం, చిన్నారులు ఆడుకోవడం వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కాలనీవాసులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

స్థానికుల విజ్ఞప్తిపై స్పందించిన విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాస్, డీఈ సుబ్బారావు, ఏఈ బి. విజయ ఆధ్వర్యంలో సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించి సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేసే పనులు చేపట్టారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో పనులు పూర్తిచేయడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రమాద భయం తొలగి కాలనీలో భద్రత మెరుగుపడిందని స్థానికులు పేర్కొంటూ, సమస్య పరిష్కారానికి కృషి చేసిన డీఈ సుబ్బారావు, ఏఈ బి. విజయతో పాటు విద్యుత్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాణిక్యపరి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు దశరథ్  కిషోర్ కృష్ణ విజయ గంధమల రాములు నర్సింగరావు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు