5 September, 2026 | 12:11 AM

రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలి

04-09-2026 | 10:51pm

మెట్ పల్లి,(విజయక్రాంతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై(AICC senior leader Rahul Gandhi) ఉత్తరాఖండ్ పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో శుక్రవారం పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రాంతాలను గంగాజలంతో శుద్ధి చేయడం ద్వారా దళితుల పట్ల వివక్ష చూపడం స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవమానకరమైన చర్య అని అన్నారు. ఈ వివక్షను ప్రశ్నించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

ప్రజల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రశ్నించే నాయకులపై కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మమ్మద్ రైస్, మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.