16 August, 2026 | 7:43 PM

Districts - Jagtial

article_82223172.webp
జిల్లా కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం

జనగామ, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ సేవలందించినందుకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి పనితీరును అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో చూపిన చొరవ కారణంగా ఈ గుర్తింపు లభించింది. ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో రాజశేఖర్ రెడ్డి కృషి అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ జనగామ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

15-08-2026

article_27716894.webp
రాజక్కపల్లి ప్రాథమిక పాఠశాలకు దాతల చేయూత

ధర్మపురి,ఆగస్టు15(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విధంగా గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు కంప్యూటర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా శనివారం పాఠశాలకు బహూకరించారు. అదేవిధంగా సాయిశ్రీనివాస లక్ష్మీ స్టోన్ క్రషర్ యజమాని గరినేని చక్రవర్తి పాఠశాలకు ప్రింటర్‌ను, విద్యార్థులకు టీ-షర్టులను అందజేశారు. ఈ సామగ్రిని గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం, మాజీ జడ్పీటీసీ దోరిశెట్టి వెంకటయ్య చేతుల మీదుగా పాఠశాలకు బహురించారు. దాతలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, పంచాయతీ కార్యదర్శి స్రవంతి,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు దోరిశెట్టి తిరుమల,విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

15-08-2026

article_58271870.webp
అంగన్వాడీలో అక్షరాభ్యాసం

మల్లాపూర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి, అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల సేవలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

13-08-2026