5 September, 2026 | 1:14 AM

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

04-09-2026 | 10:59pm

- కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ 

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ(Lakshettipet Municipality)లోని పలువురు నూతన వధూవరులను ఆశీర్వదించి, కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వందనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు.

ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న మంచిని తీసుకుపోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, పెన్షన్స్, రైతు భరోసా, పారిశ్రామిక విధానం, విద్య, వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు.

అంతకుముందు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు,రియల్ ఎస్టేట్ వ్యాపారి నరేందుల సతీష్, మూల కిషన్ గౌడ్ కుటుంబాల నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పలు రకాల కార్మికుల సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం చందారంలో మాజీ ఏంపీపీ అన్నం మంగ చిన్నన్న,తాజా మాజీ జడ్పీటీసీ ముత్తే సత్తయ్య కుటుంబాలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు