బెల్లాల్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శ్రీకారం

02-10-2026 | 05:35pm

బోధన్, అక్టోబర్ 2 (విజయ క్రాంతి):బెల్లాల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీఆర్‌ఆర్ నిధులు రూ.5 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి(Bodhan MLA P. Sudarshan Reddy) సహకారంతో ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సాయిలు, ఉపసర్పంచ్ అన్నపూర్ణ, వార్డు సభ్యులు సతీష్, సంగీత, మల్లేష్, శంకుబాయి, రూప్‌సింగ్, ప్రసాద్, కవిత, మాజీ సర్పంచ్ సంజీవ్, అడ్వకేట్ సమ్మయ్య, కాంట్రాక్టర్ నాగులు, భాస్కర్‌రావు, సెమిన్స్, విజయ్, అశోక్, రతన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు