యాదగిరిగుట్టలో ఘనంగా గాంధీ జయంతి

02-10-2026 | 08:31pm

బాపూజీ అందరికీ ఆదర్శప్రాయం మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్

యాదగిరిగుట్ట, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన గాంధీ అందరికీ ఆదర్శమని మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్(Municipal Chairman Gundlapalli Vani Bharat Goud) అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గాంధీ నగర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ బరిగే రమ్య రామ్ చందర్ , మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు బూడిద మధు , కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ,బిట్టు సరోజ హరీష్ ,పెల్లి మెల్లి లావణ్య శ్రీధర్ , పేరబోయిన సత్యనారాయణ , సాదునేని ధనలక్ష్మి మధుకర్ , ముక్కెర్ల మల్లేష్ , బబ్బురి శ్రీధర్, కో ఆప్షన్ సభ్యులు గౌలికర్ అరుణ రాజేష్ , ఎండి రహిమ , బండి జంగమ్మ , షేక్ ఉస్మాన్ షరీఫ్, సానిటరీ ఇన్స్పెక్టర్ పి సురేందర్,సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు