శతకాభిషేకం
ఊచకోత.. విధ్వంసం.. ఆకాశమే హద్దుగా భారీ షాట్లు.. సిక్సర్లతో హోరెత్తిన స్టేడియం... ఇదీ మూడో టీ ట్వంటీలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన తీరు.. రికార్డులు బద్దలైన వేళ కేవలం 30 బంతుల్లోనే శతకొట్టాడు. అటు సంజూ శాంసన్ కూడా హాఫ్ సెంచరీ సాధించగా భారత్ భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లోనూ రాణించి అఫ్గాన్‌ను చిత్తు చేసి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
- అభిషేక్ శర్మ విధ్వంసం
- 30 బంతుల్లోనే సెంచరీ
- భారత్ భారీ స్కోరు
- సిరీస్ క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో అర్షదీప్‌కు రెస్ట్ ఇచ్చి యశ్ ఠాకూర్ ను తీసుకున్నారు. భారత్ ఓపెనర్లు (India openers) అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ( Abhishek Sharma) సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దు సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ.. బౌలర్లను ఊచకోత కోసాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే 10 సిక్స్ల్, 9 ఫోర్ల సాయంతో ఫాస్టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు.
కెరీర్లో అభిషేక్ శర్మకు ఇది మూడో టీ20 సెంచరీ. టేస్ట్ హోదా కలిగిన దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన మూడో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డ్ను కూడా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డ్ హిట్ మ్యాన్ పేరిట ఉండేది.
2017లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. అభిషేక్ శర్మ సెంచరీ మార్కును అందుకోగానే మైదానంలోనే హెల్మెట్ తీసి, కింద కూర్చుని మెడి టేషన్ యోగా పోజ్ ఇస్తూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. అతడు 34 బం తుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు సంజూ శాంసన్ హా ఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే తర్వాతి బ్యాటర్లు అనుకున్నంత వేగంగా ఆడలేకపోవడం, వరుసగా వికెట్లు కోల్పోవ డంతో భారత్ 221 పరుగులు చేసింది.
తర్వాత భారీ లక్ష్య చేదనలో ఆఫ్గనిస్తాన్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. కానీ భారత్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి కట్టడి చేశారు. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ (25), రహ్మనుల్లా గుర్బా జ్ (15) కొద్దిసేపు వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ, ఎక్కు వ సమయం క్రీజులో నిలబడలేకపోయారు. అక్షర్ పటేల్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఆఫ్ఘన్‌ను దెబ్బతీశాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు నూర్ ఉల్ రహ్మాన్ (11), అజ్మతుల్లా ఒమర్జాయ్ (17) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
దీంతో ఆఫ్ఘనిస్తాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 221/7 ( అభిషేక్ శర్మ 108, సంజూ శాంసన్ 50, శ్రేయాస్ అయ్యర్ 29 ; ఒమర్జయ్ 2/27, రషీద్ ఖాన్ 1/43 )
అఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ : 94 (ఇబ్రహీం జద్రాన్ 25, రహ్మనుల్లా గుర్బాజ్ 15, నితీష్ రెడ్డి 3/25, రవి బిష్ణోయ్ 3/26, అక్షర్ పటేల్ 2/9 )