21 August, 2026 | 11:38 AM

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

21-08-2026 10:45 AM

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం(Central Government) అనుమతి నిరాకరించింది. యూకే, అమెరికా పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కేంద్రాన్ని అనుమతి కోరింది. అయితే విదేశాంగ శాఖ యూకే పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న లండన్ నుంచి అమెరికాకు వెళ్లాల్సి ఉన్న రేవంత్ రెడ్డి.. కేంద్రం అనుమతి నిరాకరించడంతో అమెరికా(Revanth Reddy's US tour) పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. లండన్ పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కాగా, రేవంత్ రెడ్డి ఆగస్టు 20న లండన్ పర్యటనకు బయలుదేరారు. తొలుత యూకే, అమెరికాలో పది రోజుల పాటు పర్యటించాల్సి ఉండగా.. అమెరికా పర్యటనపై అనుమతి లభించకపోవడంతో షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది.