టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్
- ఆమోదం తెలిపిన బోర్డు
- ఐదేళ్లపాటు పదవీకాలం పొడిగింపు
ముంబై, సెప్టెంబర్17: టాటాసన్స్ చైర్మన్ ఎవరనే ఉత్కంఠకు తెరవీడింది. టాటా సన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ (Tata Sons Limited Executive)చైర్మన్‌గా ఎన్ చంద్రశే ఖరన్‌ను సంస్థ బోర్డు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. శేఖరన్ పదవీ కాలాన్ని మరో ఐదేళ్లపాటు (2032) పొడిగించింది. అదే సమయంలో టాటా సన్స్ ఐపీఓ లిస్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించేందుకు బో ర్డు ఆమోదం తెలిపింది.
ముంబైలో టాటా సన్స్ బోర్డు సమావేశం గురువారం జరిగిం ది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ చైర్మన్‌గా ఎంతో అనుభవం ఉన్న ఎన్ చంద్రశేఖర్‌నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. 2017లో టాటాసన్స్ చైర్మన్‌గా చంద్రశేఖ రన్ బాధ్యతలు చేపట్టిన తరువాత సంస్థను డిజిటలైజేషన్ చేయడం, ఏయిర్ ఇండియా కొనుగోలు, సెమీకండక్టర్, ఈవీ రంగాల్లో వ్యాపార విస్తరణలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది.