బాలల పరిరక్షణ కమిటీ సమావేశం
మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రతపై అవగాహన
మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని(Child Protection Committee Meeting) నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పి.వినోద్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి సుభావతి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా బాలల పరిరక్షణ, వారి హక్కులు, భద్రత, సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. బాలలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
బాలల భద్రతకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గ్రామంలో బాలల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడుతూ, వారికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవలు సక్రమంగా అందేలా కృషి చేస్తామని సర్పంచ్ వినోద్ కుమార్ తెలిపారు. బాలల పరిరక్షణ కోసం కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయంతో నిరంతరం పనిచేస్తారని పేర్కొన్నారు.