వినాయ‌క ఉత్స‌వాల‌ను శాంతియుతంగా జ‌రుపుకోవాలి

09-09-2026 | 12:18am

మునిపల్లి,(విజయక్రాంతి): ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల(Ganapati Navratri celebrations)ను శాంతియుతంగా జరుపుకోవాలని కొండాపూర్ సీఐ సుమ‌న్ కుమార్(Kondapur CI Suman Kumar) కోరారు. మంగ‌ళ‌వారం మండ‌ల ప‌రిధిలోని బుదేరా చౌర‌స్తాలో గ‌ల ఎన్ గార్డెన్ లో మునిప‌ల్లి ఎస్ఐ అర‌వింద్ తో క‌లిసి  శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ స‌మ‌న్ కుమార్ మాట్లాడుతూ ఉత్సవ కమి టీ నిర్వహకులు నిబంధనలు పాటిస్తూ మండపాలను ఏర్పాటు చే సుకో వాలని, మండపాల ఏర్పాటుకు ముందు పోలీసుల అనుమతి తీసుకో వాలన్నారు. డీజేల వినియోగంపై ఉన్న నిబందనలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని, ఉత్సవాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందరు పోలీసులకు సహకరించాలన్నారు. వినాయక నిమ జ్జనం రోజు నిర్వహించే శాంతి యాత్రలో శాంతి భద్రతలను కాపాడే విధంగా ర్యాలీ నిర్వ‌హించుకోవాల‌ని సూచించారు.  ఈ కార్య‌క్ర‌మంలో పోలీసు సిబ్బంది, యువ‌కులు, ఆయా  పార్టీల నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు