వైకుంఠ రథాన్ని ప్రదానం చేసిన చిట్కుల మహిపాల్ రెడ్డి

08-09-2026 | 04:15am

మనోహరాబాద్, సెప్టెంబర్ 7: మెదక్ జిల్లా(Medak District) మనోహరాబాద్ మండలలోని గ్రామాలకు వైకుంఠ రథాన్ని కీర్తిశేషులు చిటుకుల లక్ష్మీ రామ్ రెడ్డి గార్ల జ్ఞాపకార్థంగా లక్ష్మీ రామిరెడ్డి సేవా ట్రస్ట్ ద్వారా కాంగ్రెస్ స్టేట్ నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి(Chitkula Mahipal Reddy) సోమవారం మండల ప్రజలకు వైకుంఠ రథాన్ని అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మా తల్లిదండ్రులు చిటుకుల లక్ష్మీ రామ్ రెడ్డి గతంలో మనోహరాబాద్ గ్రామానికి, మండల ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేయడం జరిగిందని మనోహరబాద్ మండల ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా వైకుంఠ రథాన్ని అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా మనోహరాబాద్ మండలంలో ఎలాంటి అసౌకర్యాలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రధానం చేసిన వైకుంఠ రథాన్ని మండల ఎంపీడీవో బాధ్యతయుతంగా చూసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

ఇందులో చిటుకుల వెంకటరెడ్డి, రింకు రెడ్డి, నాగులపల్లి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు మల్లారెడ్డి, తూప్రాన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు గరిగే నరసింహారావు, ధర్మేందర్, శశి భూషణ్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మహేందర్, మనోహరాబాద్ మండల సర్పంచులు, మరాఠీ నాగరాజు, నాగరాజు గౌడ్, కూచారం రఘు, మైనారిటీ నాయకులు జావేద్ పాషా, ఎండి ఉమర్, చిట్టిమిల్ల అనిల్, శ్రీశైలం, బిక్షపతి, ఎల్లం, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు