మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలి

13-09-2026 | 01:02pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : వినాయక చవితిలో మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని ఘట్ కేసర్ డివిజన్(Ghatkesar Division) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం డివిజన్ ప్రాంతంలో మట్టి గణపతి ప్రతిమలను ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, డీసీసీ కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్ లతో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పండుగల పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేయకుండా సంప్రదాయాలను ప్రకృతికి అనుకూలంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చేందర్ రెడ్డి, కీసర శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం డైరెక్టర్ సగ్గు అనీత, నాయకులు కొంతం అంజిరెడ్డి, కడపోల్ల మల్లేష్, కుతాడి  రవీందర్, బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఉల్లి ఆంజనేయులుయాదవ్, బొక్క సంజీవరెడ్డి,  ఖయ్యూం, కేశవపట్నం ఆంజనేయులు, మాల్గురం రాము, గోరకంటి రవీందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు