పరిశుభ్రతే నాగరికతకు చిరునామా
- ప్రతి అర కిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- కోర్ అర్బన్ రీజియన్ బిల్లుపై ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : పరిశుభ్రతే నగర నాగరికతకు(Civilization) తొలి చిరునామా అని, పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ(Solid Waste Management)కు పటిష్ట వ్యవస్థను ఏర్పా టు చేయడంతోపాటు ప్రతి అరకిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పా లని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ రెడ్డి(Uttam Padmavati Reddy) సూచించారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులు(Shopping complexes), వాణిజ్య భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను తప్పనిసరి చే యాలని కోరారు.
శనివారం అసెంబ్లీలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-- 2026’పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఘన వ్యర్థాల సేకరణ, తరలిం పు, నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికను రూ పొందించాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఘన, జీవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, నిర్మాణ పనుల ద్వారా శిథిల వ్యర్థా లు, ఆసుపత్రుల నుంచి జీవవైద్య వ్యర్థాలు, హోటళ్లు, వీధి ఆహార కేంద్రాల నుంచి ఆహా ర వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు.
వాటి స్వభావానికి అనుగుణంగా సేక రించి, శాస్త్రీయ పద్ధతిలో తరలించి, సురక్షితంగా నిర్మూలించే వ్యవస్థను ఏర్పాటు చే యాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుం డా ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థగా ఉండాలి’ అని ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రణాళికలో మహిళల అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, అవి వారి ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన అంశం గా గుర్తించాలని సూచించారు.
ఇప్పటికే అభివద్ధి చెందిన పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆచరణాత్మక పరిష్కారాలు రూపొందించాలని సూచించారు. కొ త్తగా ఈ వ్యవస్థ పరిధిలోకి వచ్చిన 24 గ్రా మాల్లో భవిష్యత్తు అవసరాలను దష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధమైన అభివద్ధికి పు నాది వేయాలన్నారు. అభివద్ధి చెందని ప్రాం తాలకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించడంతోపాటు ఇప్పటికే అభివద్ధి చెందిన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు ఆర్కిటెక్టు లు, పట్టణ ప్రణాళికా నిపుణుల సహకారంతో పరిష్కారాలు కనుగొనాలని కోరారు.