బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

03-10-2026 | 01:46pm

వికారాబాద్(Vikarabad) జిల్లా అనంతగిరి ఘాట్‌ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన బస్సు పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.


మరిన్ని వార్తలు