సీఎం విజయ్ రోడ్‌షో

02-10-2026 | 06:04pm

చెంగల్‌పట్టు: మదురాంతకం అసెంబ్లీ ఉప ఎన్నిక(Maduranthakam Assembly by-election) ప్రచారంలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్(C. Joseph Vijay) దూకుడు పెంచారు. శుక్రవారం తన ప్రచార వాహనంలో నియోజకవర్గంలోని 30కి పైగా గ్రామాలు, పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థి మరగతం కుమారవేల్(Maragatham Kumaravel)కు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. విజయ్‌ను చూసేందుకు ప్రజలు రహదారుల వెంట పెద్ద సంఖ్యలో వేచి ఉండగా, ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

టీవీకే(TVK) కార్యకర్తలు పలు కూడళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అక్టోబర్ 6న జరగనున్న ఈ ఉప ఎన్నికకు ప్రచారం తుది దశకు చేరుకుంది. మరగతం కుమారవేల్, పి. సత్యభామ ఏఐఏడీఎంకేకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో మదురాంతకం, ధారాపురం స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు చేసిన ‘హార్స్ ట్రేడింగ్’ ఆరోపణలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావనకు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు