పదేళ్ల ఎదురుచూపుకు పరిష్కారం..
23-09-2026 | 11:04pm
* భూమి పట్టాలను అందించిన కలెక్టర్...
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గత పదేళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామస్థుల భూ సమస్యను జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) చొరవతో పరిష్కారం అయింది. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కలెక్టర్ పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కలిసి తమ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తహసిల్దార్ కోట్నాక రఘునాథరావు, నర్సాపూర్ స్థానిక సర్పంచ్ గెడం జగదిరావు, పట్టాదారులు, తదితరులు పాల్గొన్నారు.