ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఘట్ కేసర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి(Division President Bokka Prabhakar Reddy) ఆధ్వర్యంలో శుక్రవారం ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘట్కేసర్ రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, కార్యదర్శి మామిండ్ల ముత్యాల్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చెందర్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ ఖయ్యూం, మీసాల సుధాకర్ రావు, మోల్గురం రామస్వామి, కందకట్ల మాధవ రెడ్డి, అధికార ప్రతినిధి కొత్తకొండ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, కీసర శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానం డైరెక్టర్ సగ్గు అనీత, నాయకులు కొంతం అంజిరెడ్డి, కడపోల్ల మల్లేష్, మేడబోయిన వెంకటేష్, ఆంజనేయులుయాదవ్, రెహ్మాన్, బొక్క సుధాకర్రెడ్డి సెక్రటరీలు కడపోల్ల రాజు, మేకల సునీల్ కుమార్, కోశాధికారి కట్కూరి నర్సింగ్ రావు, బాబురావు, అనుజ నాయక్, ఫరూఖ్, మోటుపల్లి శ్రీనివాస్, మేకల దాసు, సగ్గు శ్రీనివాస్, బొక్క సత్తి రెడ్డి, తోక మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.