ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం కోసం కృషి.
బోథ్. అక్టోబర్ 2 ( విజయక్రాంతి) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ(Congress constituency ) ఇన్చార్జి ఆడే గజేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరి అయిన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అదేవిధంగా కృషి చేస్తామన్నారు. 5 లక్షల పదివేల రూపాయల విలువైన చెక్కులను ఇంటికి వెళ్లి అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నపూర్ణ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ ఉప సర్పంచ్ విజయ రెడ్డి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, సహకార సంఘం డైరెక్టర్ సట్ల ఉమేష్, మండల అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి, అబూద్, సున్నపు శ్రీనివాస్ నరసింహ దాస్ తదితరులు పాల్గొన్నారు.