కూసుమంచిలో కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో

08-09-2026 | 12:35pm

కూసుమంచి, విజయక్రాంతి: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(Tata Madhu) చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూసుమంచిలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. మండల ఇంచార్జి భీంరెడ్డి శ్రీనివాస రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని, తెలిపారు.

వెంటనే శాసనమండలి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  జిల్లా నాయకులు ఎండీ. హాఫీజుద్దీన్, మంకెన వాసు, బజ్జూరు వెంకట్ రెడ్డి, వెంకట్ నాయక్, మాదాసు ఉపేందర్ మాట్లాడారు. తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం తాతా మధు దిష్టిబొమ్మ ను దగ్దం చేశారు. అక్కడ నుంచి అంబెడ్కర్ విగ్రహం వద్దకు వెళ్ళి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు.

మరిన్ని వార్తలు