19 August, 2026 | 6:59 PM

నిర్మల్ లో కళాకారుల భవనాన్ని నిర్మించండి

19-08-2026 06:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా చలనచిత్ర, టీవీ అసోసియేషన్‌కు చెందిన కళాకారులు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్  ను కలిసి పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ సమస్యలను మున్సిపల్ వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నిర్మల్ జిల్లా కళాకారులకు ప్రభుత్వం ద్వారా పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని కోరారు. అలాగే కళాకారుల సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా కళాకారుల భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.