వినియోగదారుల హక్కులు, రక్షణ

18-09-2026 | 05:05am

నేటి డిజిటల్ యుగంలో (Digital world) మార్కెట్ విస్తరిస్తున్న కొద్దీ వినియోగదారు లు కొత్త రకాల మోసాలు, నాసిరకం ఉత్పత్తులు, సేవల్లో లోపాలు, తప్పుదోవ పట్టిం చే ప్రకటనలను ఎదుర్కొంటున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో వినియోగదారుల హ క్కులను పరిరక్షించేందుకు వినియోగదారుల రక్షణ చట్టం(Protection Act) అండగా నిలు స్తోంది. ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ ప్రకటనలు వంటి ఆధునిక వ్యాపార విధానాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకువచ్చి రక్షణ కల్పిస్తోంది. వినియోగదారులను సాధికారపర చేందుకు చట్టం ఆరు ప్రాథమిక హక్కుల ను గుర్తించింది.  

ఆరు ప్రాథమిక హక్కులు.. 

1. రక్షణ పొందడం,2. సమాచారం తెలుసుకోవడం,3. ఎంచుకోవడం,4. తన సమస్యను విన్నవించుకోవడం,5. పరిహారం పొందడం, 6.అవగాహన హక్కు

ఈ హక్కులపై అవగాహన కలిగి ఉండ టం ద్వారా మోసపూరిత వ్యాపార విధానాలను ప్రశ్నించే అవకాశం వినియోగదా రులకు లభిస్తుంది. అంతేకాకుండా వివాదానికి సంబంధించిన మొత్తాన్ని ఆధారం గా చేసుకుని వినియోగదారుల వివాదాల పరిష్కారానికి మూడు అంచెల వ్యవస్థను చట్టం ఏర్పాటు చేసింది.

జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (డీసీడీఆర్సీ)

రూ.50 లక్షల వరకు విలువ కలిగిన ఫి ర్యాదులను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార్ కమిషన్ పరిధిలో పరిష్క రించవచ్చు. ముఖ్యంగా  వినియోగదారు లు తాము నివసించే లేదా పనిచేసే ప్రాం తంలోనే ఫిర్యాదు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఈ చట్టాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది.

రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ)

రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వర కు విలువ కలిగిన కేసులను రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార్ కమిషన్ విచారిస్తుంది. జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లనూ  స్వీకరిస్తుంది.

జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)

రూ.2 కోట్లకు పైబడిన కేసులను జాతీ య కమిషన్ విచారిస్తుంది. రాష్ట్ర కమిషన్ల తీర్పులపై అప్పీళ్లను కూడా ఇది పరిశీలిస్తుంది. జాతీయ కమిషన్ ప్రధాన కార్యా లయం న్యూఢిల్లీలో ఉంది.

అప్పీళ్లకు నిర్దిష్ట గడువు

జిల్లా కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉం టే నిర్దిష్ట గడువులో రాష్ట్ర కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. రాష్ట్ర కమిషన్ ఉత్తర్వులపై జాతీయ కమిషన్‌లో, జాతీయ కమిషన్ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.

అప్పీల్ దాఖలు చేసే సం దర్భంలో, సంబంధిత నిబంధనల ప్రకా రం దిగువ కమిషన్ విధించిన మొత్తంలో 50 శాతం వరకు ముందస్తు డిపాజిట్ అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూడా చట్టం కాలపరిమితులను నిర్దేశించింది. ల్యాబొరేటరీ పరీక్షలు లేదా సాంకేతిక నివేదికలు అవసరమైన కేసుల్లో అదనపు సమయం అవసరం కావచ్చు.

ముఖ్యమైన చట్టపరమైన నిబంధనలు

సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ): తప్పుదోవ పట్టించే ప్రకట నలు, అన్యాయ వ్యాపార పద్ధతులపై చర్య లు తీసుకోవడం, ప్రమాదకరమైన లేదా నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులను వెనక్కి తీసుకునేలా ఆదేశించడం వంటి అధికారాలను ఈ సంస్థ కలిగి ఉంది.

ప్రొడక్ట్ లయబిలిటీ (ఉత్పత్తి బాధ్యత): లోపభూయిష్టమైన ఉత్పత్తులు లేదా సేవ ల వల్ల వినియోగదారులకు నష్టం కలిగితే, పరిస్థితిని బట్టి తయారీదారు, విక్రేత లేదా సేవా ప్రదాతలను నేరుగా బాధ్యలను చేస్తుంది.     

ఈ-కామర్స్ నిబంధనలు: ఆన్‌లైన్ వేదికలు ఉత్పత్తుల తయారీ దేశం, రీఫండ్ విధానం, ఫిర్యాదుల పరిష్కారానికి సం బంధించిన సమాచారాన్ని వినియోగదారులకు అందించాల్సిన బాధ్యత ఉంది.

ఈ-జాగృతి పోర్టల్ మరియు మధ్యవర్తిత్వం: వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు దాఖలు చేసుకునే సదుపాయంతో పాటు, కోర్టు వెలుపల వివాదాల ను త్వరగా పరిష్కరించేందుకు మధ్యవర్తి త్వ విధానాన్ని కూడా చట్టం ప్రోత్సహిస్తోంది.

ఫీజు వివరాలు ఇలా..

వినియోగదారులు న్యాయస్థానాల్లో కే సు దాఖలు చేయడానికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు కేవలం కొనుగోలు చేసిన వస్తువు లేదా పొందిన సేవకు చెల్లించిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫీజు ను ఈ జాగృతి పోర్టల్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో లేదా సంబంధింత రిజిస్ట్రార్ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో గానీ చెల్లింవచ్చు.  జిల్లా కమిషన్ పరిధిలో..  రూ.5 లక్షల వరకు విలువ కలిగిన వస్తువు లేదా సేవకు సంబంధించిన ఫిర్యాదులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

రూ.5 లక్షలకు పైగా రూ.10 లక్షల వరకు రూ.200, రూ.10 లక్షలకు పైగా రూ.20 లక్షల వరకు రూ.400, రూ.20 లక్షలకు పైగా రూ.50 లక్షల వరకు రూ.1,000 ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్ పరిధిలో.. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రూ.2,000, రూ.1 కోటికి పైగా రూ.2 కోట్ల వరకు రూ. 2,500 ఫీజు ఉంటుంది.

జాతీయ కమిషన్ పరిధిలో.. రూ.2 కోట్లకు పైగా రూ.4 కోట్ల వరకు రుసుము రూ.3,000, రూ.4 కోట్లకు పైగా రూ.6 కోట్ల వరకు రూ.4,000, రూ.6 కోట్లకు పైగా రూ.8 కోట్ల వరకు రూ.5,000, రూ.8 కోట్లకు పైగా రూ.10 కోట్ల వరకు రూ.6,000, రూ.10 కోట్లకు పైబడితే రూ.7,500 ఫీజు ఉంటుంది.

ఫీజు లెక్కింపు : బాధితులు కోరిన నష్టపరిహారం ఆధారంగా కాకుండా, కేవలం కొనుగోలు చేసిన వస్తువు లేదా పొందిన సేవకు చెల్లించిన మొత్తం ఆధారంగానే పీజు నిర్దారిస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి, అంత్యోదయ కార్డు కలిగిన వినియోగదారులకు ప్రాథమిక పరిమితి వరకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

న్యాయవాది తప్పనిసరి కాదు

వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేయడానికి న్యాయవాది తప్పనిసరి కాదు. బాధిత వినియోగదారుడు స్వ యంగా ఫిర్యాదు దాఖలు చేసి, తన వాదనలను వినిపించుకోవచ్చు. .

అనుకూలతలు, ప్రతికూలతలు 

వినియోగదారుల కమిషన్లలో కేసుల పెండింగ్, సిబ్బంది లేదా మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలు సత్వర పరి ష్కారానికి సవాళ్లుగా మారుతున్నాయి. సాంకేతిక ఆధారాలు, నిపుణుల నివేదికలు అవసరమయ్యే కేసుల్లో సాధారణ వినియోగదారులకు అదనపు ఖర్చు, శ్రమ కూడా ఎదురవుతోంది.

మార్కెట్ వ్యాప్తి, పరిధి: ఈ- కామర్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు,  ప్రత్యక్ష విక్రేతలను పరిధిలోకి తీసుకురావడం పెద్ద అం శం. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో, అసంఘటిత  మార్కెట్లలో దీని అమలు ఇంకా బలహీనంగానే ఉంది.

వివాద పరిష్కార వ్యవస్థ: ఈ-జాగృతి పోర్టల్, కోర్టులతో అనుసంధానించబడిన మధ్యవర్తిత్వ సెల్స్ వేగవంతమైన పరిష్కారానికి తోడ్పడుతున్నాయి. కానీ, ట్రిబ్యున ళ్లలో విపరీతంగా కేసులు పేరుకుపోవడం వల్ల అనుకున్న సమయానికి తీర్పులు రాక ఆలస్యం జరుగుతుండటం ప్రతికూల అంశం.

జవాబుదారీతనం: కఠినమైన ప్రొడక్ట్ లయబిలిటీ చట్టాలు, తప్పు దోవ పట్టించే ప్రకటనకర్తలపై జరిమానాలు విధించడం వ్యాపారాల జవాబుదారీతనాన్ని పెంచా యి. అయితే కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు సమర్పించడం, నిపుణుల పరీక్షలు చేయించడం సాధారణ వినియోగదా రుడికి ఆర్థికంగా భారం అవుతున్నాయి.

 విశ్లేషకులు, రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

మరిన్ని వార్తలు