వీళ్లకు చదువు చెప్పడం రాదేమో..?
వ్యాయామ ఉపాధ్యాలు పని చేయరా..?
మండల పరిషత్ లో పని లేదా..?
సిద్దిపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ బడిలో(Government school) విద్యార్థుల సంఖ్య అంతంత ఉండటానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనమని సహచర ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు(Teachers) ఆటలపోటీల టోర్నమెంట్ లో ఫుడ్ కమిటీ బాధ్యతలు(Food Committee Responsibilities) స్వీకరించారు. అంటే బహుశా ఈ ఐదుగురు టీచర్లకు చదువు చెప్పడం రాదేమో అని ప్రభుత్వ ఉపాధ్యాయులు కామెంట్ చేస్తున్నారు.
సిద్దిపేట రూరల్ మండల పరిషత్(Siddipet Rural Mandal Parishad)లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగికి ఆ శాఖలో పని లేదేమో ఆయనకు క్రీడాకారులకు ఆటలాడిపించే బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈ నెల 22 నుండి 24 వరకు జరిగే ఎస్ జీఎఫ్ టోర్నమెంట్(SGF Tournament) కు 66 మంది వ్యాయామ ఉపాధ్యాలకు విధులు కేటాయించారు. ఇంత మంది ఉండగా 5 ఉపాధ్యాయులు, ఒక మండల పరిషత్ ఉద్యోగికి డిప్యూటేషన్ వేయడం పట్ల జిల్లా విద్యా శాఖ అధికారుల పని తీరును ఆ శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులే తప్పుపడుతున్నారు. వీరందరూ ఒకే ఉపాధ్యాయ సంఘం వారే అంటూ చర్చ జరుగుతుంది.